Hero Suman wants to take strict action against YouTube channels
mictv telugu

హీరో సుమన్ ఇక లేరంటూ ప్రచారం.. పరువు నష్టం దావా వేస్తానన్న నటుడు

August 31, 2022

టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ మరణించారంటూ కొన్ని ఉత్తరాది యూట్యూబ్ చానళ్లు ప్రసారం చేయడంపై ఆయన మండిపడ్డారు. తాను క్షేమంగా ఉన్నానని.. అభిమానులెవరూ ఆందోళన చెందొద్దని తెలిపారు. ఆరోగ్య పరిస్థితి గురించి గత కొన్నిరోజుల నుంచి వస్తోన్న వార్తలపై స్పందిస్తూ… ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ నిమిత్తం బెంగళూరులో ఉన్న ఆయన.. నిరాధారమైన వార్తలు ప్రసారం చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మీడియా సమావేశంలో తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో హీరో సుమన్‌కు ఎంతోమంది అభిమానులున్నారు. ఈ క్రమంలోనే సుమన్‌ మరణించారంటూ ఇటీవల పలు ఉత్తరాది యూట్యూబ్‌ ఛానెల్స్‌లో వీడియోలు దర్శమిచ్చాయి. వాటిని చూసిన సుమన్‌ అభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకులు ఆందోళనకు గురయ్యారు. ‘ఈ వార్తల్లో నిజమెంత?’ అంటూ సోషల్‌మీడియాలోనూ పోస్టులు పెట్టారు. సన్నిహితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న సుమన్‌ తాజాగా ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు. సదరు యూట్యూబ్‌ ఛానెల్‌పై పరువు నష్టం దావా వేయనున్నట్లు స్పష్టం చేశారు.