బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతిసనన్.. కొన్ని రోజుల క్రితం ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను పెళ్లాడుతానంటూ తన మనసులో మాటను బయటపెట్టింది. అయితే ఇదేదో చిట్‌చాట్ ప్రొగ్రాంలో సరాదాగా అడిగిన ప్రశ్నకు సమాధానం అని అనుకున్నారంతా. కానీ చూస్తుంటే ఆ సమాధానమే నిజమనుకునేలా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు అటు ఇండస్ట్రీతో పాటు, ఇటు ప్రభాస్ అభిమానుల్లో కూడా ఆసక్తి రేపుతున్నాయి. కృతిసనన్.. ప్రభాస్‌తో రిలేషన్ ఉన్నట్లుగా ఓ హింట్ ఇచ్చాడు వరుణ్ ధావన్.
తన రాబోయే సినిమా ‘భేదియా’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ రియాల్టీ షోలో పాల్గొన్న వరుణ్.. తన లిస్ట్‌లో కృతిసనన్ లేదని, ఆమె పేరు మరొకరి హృదయంలో ఉందని చెప్పాడు. ఆ వ్యక్తి ప్రస్తుతం ముంబయిలో లేడని, వేరే ప్రాంతంలో హీరోయిన దీపికా పదుకొణెతో కలిసి షూట్లో ఉన్నాడఅని చెప్పాడు. వరుణ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్‌గా మారాయి. కారణం.. ప్రస్తుతం ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కే లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో దీపికా పదుకుణెనే హీరోయిన్. అతని కామెంట్స్ బట్టి.. వరుణ్ మాట్లాడుతున్నది ప్రభాస్ గురించేనని అంటున్నారు నెటిజన్లు. ప్రభాస్ మనస్సుతో కృతి ఉంది కాబట్టే ఇంకా అతను పెళ్లి చేసుకోలేదని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లాడబోతున్నారంటూ కామెంట్స్ రూపంలో రకరకాలుగా చెప్పుకుంటున్నారు.
Whaaaaaaattt 😯😁🥰💖…… Joo meyy soch raha hoo, voo aap log bii?!😌😹🤔🤔. #KritiSanon #Prabhas𓃵 !! #ProjectK 🪐 pic.twitter.com/F3s91EyFwe
— Jai Kiran💕Adipurush🏹 (@Kiran2Jai) November 27, 2022
ఈ విషయంపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సినిమా ప్రమోషన్ కోసం తమ అభిమాన హీరో, పాన్ ఇండియా స్టార్ పేరుని ఇంతలా వాడుతున్నారేంటి?’ అంటూ మండిపడుతున్నారు. ప్రభాస్ పక్కన కృతిసనన్ కేవలం హీరోయిన్ మాత్రమేనని, భార్య కాదంటూ ఆ కామెంట్లకు కౌంటర్లు ఇస్తున్నారు. ప్రభాస్-కృతిసనన్ ‘ఆదిపురుష్’ కోసం కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్ నటించారు.