Hero Venkatesh Quits From Movies
mictv telugu

బ్రేకింగ్.. సినిమాలకు వెంకటేష్ గుడ్ బై ?

November 13, 2022

విక్టరీని ఇంటిపేరుగా మలుచుకున్న స్టార్ హీరో వెంకటేష్. టాలీవుడ్ లో టాప్ 4 హీరోల్లో ఒకరు. మారుతున్న ట్రెండ్ ని ఫాలో అవుతూ మల్టి స్టారర్ చిత్రాలతో వరుస హిట్స్ కొడుతున్నాడు. కంటెంట్ బాగుంటే సీరియస్ సినిమాలు చేస్తూ రాణిస్తున్నాడు. గురు, దృశ్యం, నారప్ప, వెంకిమామ, ఎఫ్2, ఎఫ్3 వంటి సూపర్ హిట్స్ తో దూసుకెళుతున్న వెంకటేష్ తాజాగా ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఆయన ఇకపై సినిమాలు చేయరని.. ఫిలిం నగర లో గట్టిగా టాక్ వినిస్పిస్తుంది. తనకెంతో ఇష్టమైన ఆధ్యాత్మిక తపనపైనే పూర్తి ఫోకస్ పెట్టనున్నారని అంటున్నారు. అయితే యువ హీరోలతో పోటీపడి ఏడాదికి మూడు నాలుగు సినిమాలను విడుదల చేసే వెంకటేష్ చేతిలో ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. మార్కెట్ లేక కాదు, కథలు నచ్చక కాదు. కావాలనే వెంకటేష్ సినిమాలను అవాయిడ్ చేస్తున్నాడట.

ఇక యంగ్ హీరో విశ్వక్ సేన్ తో ‘ఓరి దేవుడా’ తరువాత ఒక్క మూవీకి కూడా వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. కథ చెప్పడానికి దర్శక నిర్మాతలు క్యూలు కడుతున్నా.. అందుబాటులోకి రావటం లేదట. ఎప్పుడు అడిగిన ఆధ్యాత్మిక చింతనలో ఉన్నట్టు వెంకటేష్ పీఆర్వోల నుండి సమాచారం వస్తుందట. కొన్ని నెలలు వెంకటేష్ కథలు వినరు, సినిమాలు చేయరని వెంకటేష్ పీఏలు ఇన్ డైరెక్ట్ గా చెప్తున్నారట. ఇంకాస్త విరామం తరువాత కూడా కథలు వింటారో లేదో తెలియదని.. వెయిట్ చేయకుండా వేరే హీరోలతో సినిమాలు చేసుకోవాలని దర్శక నిర్మాతలకు దగ్గుపాటి వర్గం చెప్తుందట. దీంతో వెంకటేష్ ఇక సినిమాలు చేయటం కష్టమే అంటూ టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.