hero vijay devarakonda appearance before enforcement directorate investigation
mictv telugu

షాకింగ్ న్యూస్.. ఈడీ ముందుకు విజయ్ దేవరకొండ

November 30, 2022

భారీ అంచనాలతో విడుదలైన లైగర్ మూవీ బాక్సాఫీస్ దెగ్గర డిజాస్టర్ గా నిలిచింది. దాంతో పూరి డైరెక్షన్, విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ లపై భారీ విమర్శలు వచ్చాయి. కొన్నిరోజులు మీడియాకి మొహం కూడా చూపెట్టలేదు విజయ్. అయితే ఇవన్నీ పక్కనపెడితే ప్రస్తుతం లైగర్ మూవీ లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని, లైగర్ చిత్రంలో విదేశీ పెట్టుబడులు ఉన్నాయన్న అనుమానాలతో ఈడీ అటాక్ చేస్తుంది. ఇప్పటికే ఈ విషయంపై దర్శకుడు పూరి జగన్నాథ్, ఛార్మీలని విచారించిన ఈడీ అధికారులు తాజాగా విజయ్ దేవరకొండని పిలిపించుకున్నారు. లైగర్ చిత్రానికి భారీ బడ్జెట్‌ను కేటాయించడమే ఇప్పుడు చిత్ర యూనిట్‌కు తలనొప్పిగా మారింది. ఈ సినిమాకు ఇంత భారీ బడ్జెట్‌ను ఎలా సమకూర్చారని ఈడీ ఆరా తీస్తోంది.

తాజాగా ‘లైగర్’ హీరో విజయ్ దేవరకొండను ఈ అంశంపై విచారణ చేసేందుకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అధికారులు ఇచ్చిన నోటీసుల ప్రకారం విజయ్ దేవరకొండ కొద్దిసేపటి క్రితమే ఈడీ ఆఫీసుకు చేరుకున్నాడు. లైగర్ మూవీలో రెమ్యునరేషన్, అడ్వాన్స్ వంటి అంశాలపై విజయ్ ని ఈడీ ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ నేత బక్కా జడ్సన్ ఇచ్చిన సమాచారం ప్రకారం లైగర్ మూవీపై ఈడీ విచారణ చేపట్టినట్టు తెలుస్తుంది. అయితే లైగర్ సినిమాకు విదేశాల నుంచి, పలువురు రాజకీయ నేతల నుంచి లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే లైగర్ చిత్ర యూనిట్‌ను వరుసగా విచారణ చేస్తున్నారు. మరి ఈ వివాదం మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.