Hero Vijay Deverakonda was the first to react about the Liger failure
mictv telugu

‘లైగర్’ కోసం చేయగలిగినదంతా చేశా: విజయ్‌ దేవరకొండ

November 7, 2022

భారీ అంచనాలతో వచ్చి, బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చూసిన లైగర్ సినిమా గురించి విజయ్ దేవరకొండ తాజా ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. సినిమా ఫ్లాప్ అయిందని చెబుతూనే… అందులో నటించడమే గొప్ప అవకాశమని చెప్పారు. సినిమా కోసం చాలా శారీరకంగా, మానసికంగా చాలా కష్టపడ్డానని.. తాను చేయగలిగినదంతా ఆ సినిమా కోసం చేశానని చెప్పాడు. కానీ ఫలితం దక్కలేదని, ఆ ఫెయిల్యూర్‌ని కూడా పాజిటివ్ గానే తీసుకున్నట్లు తెలిపాడు. తప్పు చేయడమంటే తెలియని విషయాన్ని నేర్చుకోవడమని, ఒకవేళ ఎవరైనా తమ తప్పు చేయట్లేదంటే వారు ఉన్నత స్థానం కోసం గట్టిగా ప్రయత్నించనట్టేనని వివరించారు. సక్సెస్‌ వచ్చినా రాకపోయినా ప్రయత్నాన్ని విరమించకూడదన్నారు. అనుకున్న ఫలితాన్ని అందుకోని సమయంలోనూ ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉంటానని తెలిపారు. జీవితంలో జయపజయాలు సహజమన్నారు.