Hero Vijay Keerti Suresh Dating
mictv telugu

కీర్తి సురేష్ తో రచ్చకెక్కిన విజయ్ రిలేషన్..!

January 24, 2023

Hero Vijay Keerti Suresh Dating

“జస్టిస్ ఫర్ సంగీత” అనే హ్యాష్‌ట్యాగ్ కింద తలపతి విజయ్‌ని నటి కీర్తి సురేష్‌తో లింక్ చేస్తూ బుద్ధిలేని ట్రోల్స్, విమర్శలు చేస్తూ.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. తన భార్య సంగీతతో విజయ్ విడాకులు తీసుకోబోతున్నాడని పుకార్లని స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాంటి విజయ్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో రచ్చ చేస్తున్నారు. తమిళ మీడియాలో అయితే ప్రధానంగా హీరో విజయ్ ని టార్గెట్ చేస్తున్నారు. నటి కీర్తి సురేష్ తో డేటింగ్ చేస్తూ భార్యకి విజయ్ అడ్డంగా దొరికిపోయాడని ప్రచారం చేస్తున్నారు. భార్యకి ఎఫైర్ గురించి తెలిసి సీరియస్ అయిందని, వీరిద్దరికి మధ్యవర్తి అయిన మేనేజర్ ని సంగీత ఇప్పటికే ఉద్యోగం నుండి తీసేసిందని అంటున్నారు. ఇక భర్త విజయ్ కి స్ట్రాంగ్ వార్ణింగ్ కూడా ఇచ్చిందని మరోసారి రిపీట్ అయితే డివోర్స్ ఇచ్చేస్తానని హెచ్చరించినట్టు కథనాలు వస్తున్నాయి.

అయితే భార్య మాటలు విజయ్ లైట్ తీసుకుని చెన్నై సర్కిల్స్ లో కీర్తి సురేష్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని అంటున్నారు. ఇక సంగీత ఉద్యోగం నుండి తీసేసిన మేనేజర్ ని హీరో విజయ్ ఏరికోరి నిర్మాతని చేస్తున్నాడని అంటున్నారు. ఈ మూవీలో కీర్తి సురేష్ ని హీరోయిన్ గా తీసుకున్నారని చెప్తున్నారు. ఒక ప్రముఖ తమిళ మీడియా వెబ్ సైట్ లో ఈ వార్త ప్రముఖంగా ప్రచురితం అయింది. గతంలో ‘భైరవ’, ‘సర్కార్’ సినిమాల్లో విజయ్ తో కలిసి కీర్తి సురేష్ నటించింది. విజయ్-లోకేష్ కనగరాజ్ కాంబో లో తీస్తున్న కొత్త సినిమాలోనూ కీర్తినే హీరోయిన్ అని అంటున్నారు. మరోవైపు విజయ్ మేనేజర్ జగదీష్ నిర్మిస్తున్న‘రివాల్వర్ రీటా ’లోనే కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తోంది. దీంతో విజయ్-కీర్తి మధ్య ఏదో రిలేషన్ ఉందనేలా పలువురు తమిళ నెటిజన్స్ ట్వీట్స్ పెడుతున్నారు. ఇక ఇక్కడితో ఆగకుండా పెళ్లి కూడా చేసేసుకుంటారని ప్రచారం చేస్తున్నారు.