hero visal says about his marriage
mictv telugu

ఆమెతోనే నా పెళ్లి :హీరో విశాల్

November 8, 2022

hero visal says about his marriage

నటుడు విశాల్ తన పెళ్లికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. తాను లవ్ మ్యారేజ్ చేసుకుంటా అని..అరేంజ్డ్ మ్యారేజ్ తనకు సెట్ కాదని విశాల్ చెప్పేసాడు. త్వరలోనే తాను ప్రేమించిన అమ్మాయిని అందరికీ పరిచయం చేస్తానని తెలిపాడు. అయితే తన పెళ్ళికి మూడేళ్లు సమయం పడుతుందని వెల్లడించాడు. యాక్టర్స్ యూనియన్ కోసం కడుతున్న బిల్డిండ్ పూర్తయ్యాకే మ్యారేజ్ అంటున్నాడు ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్..

ఇక విశాల్ ప్రియురాలు ఎవరన్నదానిపై చర్చ నడుస్తోంది. హీరోయిన్ అభినయతో ప్రేమలో ఉన్నాడనే వార్తలు రావడంతో ఆమెతో విశాల్ పెళ్లి అంటున్నారు. ‘మార్క్ ఆంటోనీ’ చిత్రంలో విశాల్‌కు భార్యగా అభినయ నటించింది. గతంలో కూడా ఈ హీరో పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. ముందు నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌తో ప్రేమ వ్యవహారం అంటూ ప్రచారం జోరుగా సాగింది.. పెళ్లి కూడా చేసుకుంటారని రూమర్లు వచ్చాయి. అయితే అవేవీ నిజం కాలేదు. ఆ తర్వాత హైదరాబాద్‌కు చెందిన యువతితో విశాల్‌ నిశ్చితార్థం కూడా జరిగింది అని టాక్ వచ్చింది.ఇప్పుడు మరోసారి విశాల్ పెళ్లి విషయం హాట్ టాపిక్ అయ్యింది.