Hero Vishal gifted gold chains to his fans club presidents in chennai
mictv telugu

వాళ్లందరికీ బంగారు చైన్లు ఇచ్చిన విశాల్.. వాళ్లేం చేశారంటే

November 11, 2022

దక్షిణాదిలో హీరోకు ఉండే క్రేజే వేరు. అభిమాన హీరో సినిమా వచ్చిందంటే చాలు విడుదలకు ముందే అభిమానులు తెగ హడావిడి చేస్తుంటారు. ఈ అభిమానాన్ని కేవలం సినిమాలతోనే ఆపకుండా హీరో పేరుమీద సంఘాలు స్థాపించి సేవా కార్యక్రమాలు కూడా విరివిగా చేస్తుంటారు. ముఖ్యంగా తమిళనాడులో ఈ సంస్కృతి ఎక్కువ. ఎందుకంటే అక్కడ హీరోలను దేవుళ్లుగా, హీరోయిన్లను దేవతలుగా భావించి ఏకంగా గుడి కట్టేసి ఆరాధిస్తుంటారు. ఈ నేపథ్యంలో మనకు సుపరిచితుడైన హీరో విశాల్ అభిమాన సంఘం వారు చేసిన పని ఆయనను ఆకట్టుకుంది.

విశాల్ ప్రజా సంక్షేమ సంఘం తరపున రాష్ట్రవ్యాప్తంగా నిర్వాహకులు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తిరువళ్లూరు జిల్లాకు చెందిన అభిమాన సంఘం అధ్యక్షుడు కన్నన్, చెన్నై సంఘం కార్యదర్శి హరికుమార్ నేతృత్వంలో స్థానిక మాధవరంలో 11 పేద జంటలకు ఉచితంగా వివాహం జరిపించారు. ఈ విషయం విశాల్ దృష్టికి వెళ్లడంతో ఆయన వారిని పిలుపించుకొని బుధవారం ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాక, మంచి పనులు చేస్తున్న వారిని ప్రోత్సహించేలా తలా ఓ బంగారు చైనును బహుమతిగా ఇచ్చి స్వయంగా వారి మెడలో వేశాడు.