Hero Vishal Severely Injured On ‘Mark Antony’ Sets While Shooting A Tough Fight Sequence
mictv telugu

షూటింగ్‌లో మళ్లీ ప్రమాదం.. హీరో విశాల్‌కు తీవ్రగాయాలు

August 11, 2022

హీరో విశాల్‌ సినిమా షూటింగ్‌లో మరోసారి తీవ్రంగా గాయపడ్డారు. ఆయన హీరోగా నటిస్తున్న ‘మార్క్‌ ఆంటోనీ’ షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. సినిమాలోని కీలక ఫైట్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుందని, ప్రథమ చికిత్స అనంతరం విశాల్‌ షూట్‌ నుంచి బ్రేక్‌ తీసుకున్నారని తెలిసింది.

కాగా విశాల్‌కు గాయాలు కావడంతో ‘మార్క్‌ ఆంటోనీ’ షూట్‌ నిలిపివేశారు. సోషల్‌మీడియా వేదికగా ఈ వార్తలు బయటకు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక, సినిమాల కోసం విశాల్ ఎలాంటి రిస్క్‌లనైనా తీసుకోవడానికి ముందుంటారు. గతంలోనూ ఆయన పలు సినిమాల షూటింగుల్లో గాయాలపాలయ్యారు.

ఇటీవలే ‘లాఠీ’ షూటింగ్ సమయంలో గాయపడ్డ విశాల్ కోలుకుని తాజాగా కెమెరా ముందుకొచ్చాడు. చెన్నైలో ఈ ఉదయం ‘మార్క్ ఆంటోని’ షూటింగ్ సమయంలో మరోసారి తీవ్రంగా గాయపడ్డట్లు కోలీవుడ్ మీడియా చెబుతోంది. అదిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.