యంగ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ చిత్రం మే 6న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. తాజాగా హైదరాబాద్ నడిరోడ్డుపై చేసిన ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. నగరంలోని ఫిలింనగర్ రోడ్డులో ఓ అభిమాని చేత సూసైడ్ చేయిస్తున్నట్టుగా వీడియో చేయించి రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశారు. సినిమాలో హీరోకి 33 ఏళ్లొచ్చినా పెళ్లి కాలేదని, తనకు బాధగా ఉందని.. సదరు అభిమాని ఆత్మహత్య చేసుకుంటానని చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆ మార్గంలో వెళ్లే వాహనదారులంతా ఇది చూసి చాలా కంగారు పడ్డారు. ఆ తర్వాత ఇదంతా ప్రాంక్ వీడియో అంటు తాపీగా చెప్పడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ ప్లేస్‌లో, అది కూడా రద్దీగా ఉండే ఏరియాలో వాహనదారులు ఇబ్బందిపడేలా ప్రవర్తించడమేంటని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీీవీ9 న్యూస్ చానల్లో యాంకర్ దేవీ నాగవల్లి దీనిపై డిబేట్ నిర్వహించి, విశ్వక్ సేన్‌ను కూడా ప్రశ్నించింది.
ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా ప్రాంక్ వీడియోలు చేయడం ఏంటని ప్రశ్నించింది సదరు టీవీ యాంకర్. పబ్లిక్ ప్లేస్ లో ఇలా చేయడం సమంజసమేనా అని ప్రశ్నిస్తూ.. విశ్వక్‌ను డిప్రెషన్ పర్సన్, పాగల్ సేన్ వంటి పదాలు ఉపయోగించింది. దీంతో విశ్వక్ యాంకర్‌పై ఫైర్ అయ్యాడు. ‘మీరెవరు నన్ను డిప్రెస్డ్, పాగల్ అని పిలవడానికి?’ అంటూ పలు ఘాటు వ్యాఖ్యలు సంధించారు. దాంతో ఒళ్లు మండిన నాగవల్లి.. గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో అంటూ గట్టిగా అరిచింది. ఆ క్రమంలో యాంకర్‌పై అభ్యంతరకర( ఫకింగ్ గర్ల్) అనే పదాన్ని వాడాడు. ‘నేను బయటకు పోతే నా గురించి ఇష్టమొచ్చినట్లు చెబుతారు. యు జస్ట్ షటప్’ అనేసి విశ్వక్ స్టూడియో నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, నడిరోడ్డుపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ హంగామా సృష్టించిన నేపథ్యంలో, విశ్వక్సేన్పై మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)లో ఫిర్యాదు దాఖలైంది. సినిమా ప్రచారం కోసం రోడ్డుపై న్యూసెన్స్ చేశారని హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.