ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, నమిత మల్హోత్రా, మధు మంతెనలు సంయుక్తంగా.. 1500కోట్లతో తెరకెక్కిస్తున్న భారీ బాలీవుడ్ చిత్రం రామాయణం. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ ఈ ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం ‘రామాయణం’ కోసం అప్పుడే పని ప్రారంభించాడు. ఈ ప్రాజెక్ట్ కోసం ‘కెజిఎఫ్’ స్టార్ యష్‌ని సంప్రదించినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. రావణుడి పాత్రను పోషించడానికి మేకర్స్ యష్‌తో చర్చలు జరుపుతున్నారు. అతను ప్రాజెక్ట్‌లో భాగం కావడానికి అంగీకరిస్తే.. ‘రామాయణం’ యష్‌కి తొలి బాలీవుడ్ చిత్రం కానుంది. అయితే అర్జునుడిగా సూపర్ స్టార్ రణబీర్ కపూర్ కన్ఫర్మ్ అయిపోగా.. రావణుడి పాత్ర కోసం తొలుత హృతిక్ రోషన్ ని అప్రోచ్ అయ్యారు మేకర్స్.
అయితే విలన్ షేడ్స్ ఉన్న పాత్ర చేసిన విక్రమ్ వేద మూవీ డిజాస్టర్ కావటంతో హృతిక్ ఎందుకో నెగిటీవ్ పాత్రలని చేయొద్దు అనుకుంటున్నాడట. అందుకే ఈ రామాయణంలో రావణుడి పాత్రని రిజెక్ట్ చేశాడట. అయినా హృతిక్ కోసం చివరి వరకు ప్రయత్నాలు చేస్తారనుకుంటే సడెర్న్ గా యష్ పేరు లైన్ లోకి వచ్చేసింది. దర్శకుడు నితేష్ ఇచ్చిన బ్రీఫ్.. రాకీ భాయ్ కి బాగా నచ్చిందట. కానీ అధికారిక ప్రకటన మాత్రం చేయాల్సి ఉంది. ఒకవేళ యశ్ ఒకే చెబితే.. ఈ భారీ ప్రాజెక్టుకు మరింత క్రేజ్ పెరగనుంది. గత ఏడాది కేజీఎఫ్ 2 విడుదలై బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. కన్నడ సినిమా వైపు అందరూ తిరిగి చూసేలా చేసింది. ఇక రావణుడి పాత్రలో యశ్ నటిస్తే.. రాకీ భాయ్ అనే గ్యాంగ్‌స్టర్ నుంచి రావణ్‌గా మారనున్నాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.