heroin bikini photo in Farmland
mictv telugu

ఏం ఐడియారా బాబూ….

November 8, 2022

పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తిప్పలు పడుతుంటారు. పంట చేలల్లో దిష్టిబొమ్మలు ఏర్పాటు చేసి.. అడివి జంతువులు, పిట్టలు తినకుండా ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా వాటి బారి నుంచి పంటలను రక్షించుకోలేక తీవ్రంగా నష్టపోతున్నారు. పంటలను కాపాడుకోవడానికి రకరకాల ఐడియాలు వేస్తుంటారు రైతులు. కొన్నిసార్లు అవి ఫలిస్తాయి…మరికొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటాయి.

ఈమధ్య రైతన్నలు బాగా క్రియేటివ్ అయిపోయారు. ఒకిరిని మించి మరొకరు ఐడియాలు వేస్తూ తమ పంటలను కాపాడుకుంటున్నారు. దాని కోసం వింత వింత పద్ధతులను ఫాలో అవుతూ ట్రెండింగ్ అకూడా అవుతున్నారు. మెున్నీమధ్య భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో ఓ రైతన్న తన పంటకు దిష్టి తగలకుండా ఉండేందుకు సీరియల్ నటి ఫ్లెక్సీని పంట చేనులో పెట్టి వార్తల్లో నిలిచాడు. ఇప్పడు మహబూబాబాద్ జిల్లాలో మరో రైతు వంతు. ఇతను హీరోయిన్ల ఫోటోలను దాటి మరి కొంచెం ముందుకు వెళ్ళిపోయాడు. పెట్టింది హీరోయిన్ ఫోటోనే కానీ ఓ రెండడుగులు ముందుకు వేసి హీరోయిన్ బికినీలో ఉన్న ఫోటో పెట్టాడు. తన పంటకు దిష్టి తగలకుండా ఈ ఏర్పాటని చెబుతున్నాడు పైగా.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేటకు చెందిన మల్లయ్య అనే రైతు తన మిరపచేనులో బాలీవుడ్ హీరోయిన్ బికినీలో ఉన్న ఫోటో ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. గతేడాది ఎకరన్నర పొలంలో మిరపచేను వేస్తే దిష్టి తగిలి పెట్టుబడి కూడా మిగల్లేదట. తన పొలం రోడ్డు పక్కనే ఉండటంతో రహదారిపై వచ్చి పోయే వాళ్ళ కను దిష్టిపడి పంట చేతికి రాలేదట. అందుకే ఈ ఏర్పాటు అంటున్నాడు.

ఈ సారి తన పంటకు అస్సలు దిష్టి ఉండదు అంటున్నాడు మల్లయ్య. పంట మీద దృష్టిని ఫ్లెక్సీమీదకు వెళుతుంది కాబట్టి తన పంట సేఫ్ అని అంటున్నాడు. పంటకు దిష్టి తగులుడు మాటేమో కానీ.. రహదారిపై వెళ్ళే వాళ్ళు ఆ ఫోటోను చూసి రైతన్న ఐడియాకు మాత్రం అదిరిపోతున్నారు.ఈ ఒక్క ఫోటోతో రైతు మల్లయ్య ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫేమస్ అయిపోయాడు కూడా.

దిష్టి తగలడం అనేది ఉందా లేదా అన్న విషయం పక్కన పెడితే…నమ్మకాలు మనుషులని ముందుకు నడిపిస్తాయన్నది మాత్రం నిజం. మరీ మూఢ నమ్మకాల జోలికి వెళ్ళనంత వరకూ ఇలాంటి పనులు చేసినా పర్వాలేదు. ఎవరికీ ఇబ్బంది ఉండదు పైగా అతని ఆత్మవిశ్వాసం కూడా దెబ్బ తినదు.