గల్రానీ సిస్టర్స్ ఇంట డబుల్ సెలబ్రేషన్స్.. చెల్లి పెళ్లి, అక్క డెలివరీ - MicTv.in - Telugu News
mictv telugu

గల్రానీ సిస్టర్స్ ఇంట డబుల్ సెలబ్రేషన్స్.. చెల్లి పెళ్లి, అక్క డెలివరీ

May 20, 2022

హీరోయిన్స్ సంజనా గల్రానీ, నిక్కీ గల్రానీ ఇంట డబుల్ ధమాకా సెలెబ్రేషన్స్ నడుస్తున్నాయి. ఈ కుటుంబం నుంచి ఒకేసారి రెండు గుడ్ న్యూస్‌లు రావడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అక్కచెల్లెళ్లయిన సంజనా గల్రానీ, నిక్కీ గల్రానీ పలు సినిమాలతో మంచి గుర్తింపు పొందారు. ఈ ఇద్దరూ ఒకేసారి తమ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌ చెప్పారు. ప్రభాస్ మూవీ బుజ్జిగాడు సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన సంజనా గల్రానీ తల్లిగా ప్రమోషన్‌ పొందింది. తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమెకు వైద్యం అందించిన మహిళా డాక్టర్‌ సోషల్‌ మీడియాలో తెలిపింది. ‘బాబు పుట్టాడు, కంగ్రాట్యులేషన్స్‌’ అన్న క్యాప్షన్‌ను జోడిస్తూ సంజనతో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది. ఇదిలా ఉంటే సంజన సోదరి నిక్కీ గల్రానీ రెండు రోజుల క్రితం ఆదిపినిశెట్టితో పెళ్లి చేసుకొని మెట్టినింట అడుగుపెట్టింది. బుధవారం చెన్నైలో ఘనంగా జరిగిన ఈ వివాహ వేడుకలో కుటుంబ సభ్యులతో పాటు అతి తక్కువమంది సన్నిహితులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. టాలీవుడ్ నుంచి హీరోలు నాని, సందీప్‌ కిషన్‌ తదితరులు సంగీత్‌ వేడుకలో సందడి చేశారు.