బీరును ఇట్లా కూడా వాడ్తారా..... - MicTv.in - Telugu News
mictv telugu

బీరును ఇట్లా కూడా వాడ్తారా…..

July 26, 2017

బీర్ తో ఏం చేస్తారు… ఇదేం ప్రశ్న. ప్రశ్నకూ ఓ అర్థం… పర్థం ఉండి తీరలా…? అంటే. అవును ఉండి తీరాల్సిందే అని మీరంటే  గనుక.. లేదా అనుకుంటే గనుక. బీరు ను  కేవలం తాగడానికే కాదు. దాన్ని షాంపూలా కూడా వాడతారని చెప్తూన్నారు కొందరు. ఇట్లా చేసేది అందరూ కాదు.. అట్లా అని కొందరూ కాదు. ఇప్పటికైతే ఒకరు  చేస్తున్నారు. ఆ ఒక్కరే….కోలివుడ్ హిరోయిన్… ఆనంది. మన తెలుగు సిన్మాల్లో కూడా నటించిదీమె. ఈమె కంటే ఆమె కురులే చాల అందంగా ఉంటాయట.  అంత అందంగా ఎందుకున్నాయంటే… వాటికి తాను బీరు  రాస్తానని చెప్పారట. మరి నోట్లోకి పోదా అంటే…  బీరు తాగక పోతే కదా అని కూడా  అన్నారట. అయినా బీరు కేవలం తాగేందుకేనని ఎవ్వరన్నారు. తాగొచ్చు.. వీలైతే స్నానం చేసుకోవచ్చు…  ఈ అందాల సుందరి సెలవిచ్చినట్లు కురులకూ పూసుకోవచ్చు. ఎవరి  ఆనందం వాళ్లది.