సూర్యాపేటలో హీరోయిన్ అనుపమ గాలి తీసేసిన అభిమానులు - MicTv.in - Telugu News
mictv telugu

సూర్యాపేటలో హీరోయిన్ అనుపమ గాలి తీసేసిన అభిమానులు

April 26, 2022

సినీ సెలెబ్రెటీలు బయటకు వస్తే అభిమానుల తాకిడి విపరీతంగా ఉంటుంది. కొన్నిసార్లు వారికి అభిమానుల విపరీత ప్రవర్తన ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి పరిస్తితే టాలీవుడ్ సినీ నటి, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కు ఎదురైంది. అనుపమ ఇటీవల సూర్యాపేట, కోదాడలలో ఓ షాప్ ఓపెనింగ్‌కు హాజరయ్యారు. భారీగా తరలివచ్చిన అభిమానులను చిరునవ్వుతో పలకరించారు. స్థానిక అభిమానులు, యువకులు ఆమెను తమ సెల్ ఫోన్ల కెమెరాల్లో బంధించడానికి పోటీపడ్డారు. ఈ క్రమంలో అప్పుడే వెళ్లిపోవద్దని, ఇంకా కొంచెం సమయం వరకు ఇక్కడే ఉండాలని అభిమానులు కోరారు. అయితే అప్పటికే ఆలస్యమైందని, తప్పనిసరిగా వెళ్లాలని అనుపమ వెళ్లేందుకు రెడీ అయ్యింది. దీంతో కొందరు ఆకతాయిలు ఆమె ప్రయాణించే కారు టైరులో గాలి తీసేశారు. అభిమానుల చర్యతో అనుపమ అసహనానికి గురవగా, నిర్వాహకులు ఆమెకు మరో కారు ఏర్పాటు చేసి క్షేమంగా అక్కడినుంచి హైదరాబాదు పంపించారు. కాగా, అభిమానుల చర్యకు అనుపమ బాగా హర్ట్ అయినట్టు తెలుస్తోంది.