మహేష్‌బాబు మొఖంపై కొట్టి క్షమాపణలు కోరిన హీరోయిన్ - MicTv.in - Telugu News
mictv telugu

మహేష్‌బాబు మొఖంపై కొట్టి క్షమాపణలు కోరిన హీరోయిన్

May 3, 2022

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. సోమవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజయింది. అనంతరం యూట్యూబులో రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. మహేశ్ చెప్పిన పంచ్ డైలాగులు, పాత్ర క్యారెక్టరైజేషన్, ఆటిట్యూడ్ సినీ అభిమానుల్లో అంచనాలను పెంచుతోంది. ఇదిలా ఉండగా, చిత్ర బృందం సినిమా ప్రమోషన్‌ను జోరుగా చేస్తోంది. ఓ వైపు దర్శకుడు పరశురాం పలు ఆసక్తికర విషయాలను పంచుకోగా, హీరోయిన్ కీర్తి సురేష్ మహేశ్‌తో తన షూటింగ్ అనుభవాలను మీడియాతో పంచుకుంది. ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ‘టైమింగ్’ తప్పి మహేశ్‌ను మూడు సార్లు నిజంగా కొట్టేశానని తెలిపింది. ఆ సమయంలో మహేశ్ బాబు ఏమైనా అనుకుంటారేమోనని భయంతో వణికిపోయానని చెప్పింది. కానీ, మహేశ్ మాత్రం సరదాగా ‘నా మీద పగేమైనా పెట్టుకున్నావా’ అంటూ వాతావరణాన్ని తేలికపరచేవాడని గుర్తు చేసుకుంది. కాగా, మే 12న ఈ చిత్రం విడుదలవుతోంది.