Home > Featured > నయనతారతోనే పిల్లల్ని కంటాను.. విఘ్నేష్ తేల్చేశాడు..

నయనతారతోనే పిల్లల్ని కంటాను.. విఘ్నేష్ తేల్చేశాడు..

Heroine nayantara love vighnesh shivan .jp

సెలబ్రిటీల ప్రేమ వ్యవహారాలు సూటిగా ఉండవు. కెరీర్ దెబ్బతింటుందని కొందరు, బంధాలపై అనుమానాలో కొందరు వ్యక్తిగత విషయాలు బయటపెట్టడానికి ఇష్టపడరు. అలాగని అన్నీ దాచుకుని రహస్యంగానూ ఉండలేదు. దక్షిణాది టాప్ హీరోయిన్ నయనతార రెండు బ్రేకప్స్ తర్వాత దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో డేటింగ్ వ్యవహారం అలాగే సాగుతోంది. ఒకరంటే ఒకరికి ప్రాణంగా తిరుగుతున్న ఈ జంట తమ ప్రేమగురించి బాహాటంటానే చెబుతోంది. అయితే పెళ్లి విషయంలో ఇంకా బయటపడ్డం లేదు.

విఘ్నేష్ నిన్న మదర్స్ డే సందర్భంగా ఆ విషయం కూడా తేల్చిచెప్పాడు. తన పిల్లలకు జన్మనివ్వబోయే తల్లికి హ్యాపీ మదర్స్‌ డే అంటూ నయన్ ఓ పిల్లాడిని ఎత్తుకున్న ఫొటో పెట్టి ట్వీట్ తోసేశాడు. ‘నా పిల్లలకు జన్మనివ్వబోయే తల్లి చేతుల్లో ఉన్న పాప తల్లికి మాతృదినోత్సవ శుభాకంక్షలు..’ అని అన్నాడు. నయన్ తల్లికి కూడా విషెష్ చేశాడు. 'ఒక అందమైన పిల్లను మీరు అద్భుతంగా పెంచారు. లవ్‌ యు సో మచ్. థ్యాంక్యు అమ్ము' అని కొనియాడాడు. నటుడు శింబు, యాక్టర్ డాన్సర్ ప్రభుదేవాతో ప్రేమవైఫల్యాల తర్వాత నయన్ విఘ్నేష్ కు చేరువైంది. ప్రేమికులు రోజు, న్యూ ఇయర్ రోజున వీళ్లు విదేశాల్లో రొమాంటిగ్గా గడిపేశారు.

Updated : 11 May 2020 5:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top