నయనతార సాయం 20 లక్షలు.. దక్షిణాది నుంచి తొలి హీరోయిన్  - MicTv.in - Telugu News
mictv telugu

నయనతార సాయం 20 లక్షలు.. దక్షిణాది నుంచి తొలి హీరోయిన్ 

April 4, 2020

Heroine Nayanthara Donation  

లాక్‌డౌన్ కారణంగా సినీ పరిశ్రమలు షూటింగులు అన్ని ఆగిపోయాయి. దీంతో అందులో పని చేసే కార్మికులు పనిలేక నిత్యావసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. వీరిని ఆదుకోవడానికి ఇప్పటి వరకూ చాలా మంది హీరోలు ముందుకు వచ్చారు. కానీ దక్షిణాదిలో ఒక్క ప్రణీత మినహా ఏ హీరోయిన్ కూడా స్పందించలేదు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లకు ఏమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో హీరోయిన్ నయనతార తనవంతు సాయం ప్రకటించారు. 

దక్షిణాది సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ)కు ఆమె రూ.20 లక్షల విరాళం అందించారు. హీరోయిన్లలో ముందుగా సినీ రంగ కార్మికులకు కోసం డబ్బులు ఇచ్చింది ఒక్క నయనతారనే ప్రథమం. హీరోయిన్ ప్రణీత కూడా ఇటీవల తన ట్రస్ట్ నుంచి పేదలకు ఆహారం అందిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే చాలా మంది అగ్రహీరోలు ముందుకు వచ్చి విరాళాలు సేకరిస్తున్నారు. బాలీవుడ్ నుంచి కూడా పలువురు హీరోలు,హీరోయిన్లు ముందుకు వచ్చారు. కంగనా రనౌత్ పీఎం కేర్స్ నిధికి 25 లక్షలు ప్రకటించారు. దీపికా పదుకోనే కూడా తన వంతుగా సాయం చేస్తామని చెప్పారు.ప్రస్తుత విపత్కర సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పలువురు సెలబ్రెటీలు అభిప్రాయపడుతున్నారు.