heroine rakshita weight gain photos going viral'
mictv telugu

ఇడియట్ హీరోయిన్ ఆరోగ్యానికి ఏమైంది.. ఆ వ్యాధే కారణమా ?

October 23, 2022

రవితేజ ఇడియట్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ రక్షిత.. ఆ తరువాత చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్‌ వంటి స్టార్ హీరోలతో నటించింది. కెరీర్ ఆరంభంలోనే బొద్దుగుమ్మాగా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు గుర్తుపట్టనంతగా మారిపోయింది. చక్కటి రూపంతో ఉండే ఆమె ఇప్పుడు మరిబొద్దుగా ఎవరు గుర్తుపట్టలేనంతగా బరువు పెరిగిపోయింది. మహారాష్ట్ర వాసి అయిన రక్షిత రైవతేజాకి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన ఇడియట్ మూవీ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ ఆరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఆంధ్రావాలా చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ బోల్తా కొట్టినా హీరోయిన్ గా రక్షితకి మంచి పేరే తీసుకొచ్చింది.

ఇక ఈ సినిమాల తరువాత చిరంజీవితో అందరివాడు, మహేష్ బాబుతో నిజం, నాగార్జునతో శివమణి వంటి అడపాదడపా సినిమాలు చేస్తూనే ప్రేమపెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. కన్నడ దర్శకుడు ప్రేమ్‌తో ఏర్ప‌డిన పరిచ‌యం ప్రేమ‌గా మారి పెళ్లి చేసుకుని సెటిల్ అయిన రక్షిత.. తాజాగా ఒక ఈవెంట్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. తన భర్త ప్రేమ్ దర్శకత్వంలో కె.డి. చిత్రం టైటిల్‌, టీజ‌ర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె లుక్‌ పూర్తిగా మారిపోయింది. విపరీతంగా బరువు పెరిగిపోయింది. పెళ్లి తరువాత ఎవరైనా బరువు పెరగటం సహజమే అయినా రక్షిత మాత్రం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అయితే రక్షిత లుక్ విషయంలో కేర్ తీసుకోకపోవటం వంటివి ఏమి కాదని.. ఆమె కొన్ని ఆరోగ్య కారణాలతో బాధపడుతుంది కన్నడ మీడియా చెప్తుంది. ఆమె ఎదో సీరియస్ గైనిక్ సమస్యని ఎదుర్కొంటుందని అంటున్నారు. అందుకే ఆమె బరువు రోజురోజకి పెరిగిపోతుందని చెప్తున్నారు. ఇక స్టేజ్‌పై ఎక్కిన ర‌క్షిత‌.. తెలుగు సినిమాతో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని తెలుగు ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.