ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ మధ్య బంధాలు స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇప్పుడంటే అంత కమర్షియల్ కానీ అప్పట్లో నటీనటులు ఒక ఫ్యామిలీలా మెలిగేవారు. ఇక అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి వాళ్ళ రిలేషన్స్ పై రూమర్స్ పెద్దగా ఉండేవి కావు. ఒకవేళ అప్పుడు కూడా సోషల్ మీడియా ఉండుంటే నటుడు జేడీ చక్రవర్తి పేరు నిత్యం వివాదాస్పదం అయ్యేదే. వర్మ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జేడీ.. కాంట్రవర్సీలకు అస్సలు వెనుకాడడు. గులాబీ సినిమా హీరోయిన్ కోసం దర్శకుడితో గల్లపెట్టుకుని గొడవ పడినట్టు కూడా ఈయనపై ప్రచారం ఉంది. ఆర్జీవీలా నిర్మొహమాటంగా మాట్లాడే అలవాటున్న జేడీ చక్రవర్తిపై హీరోయిన్ రంభ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది.
జేడీ చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినప్పటికీ తన పెళ్లికి రాకపోవడం పట్ల అప్సెట్ అయినట్లు తెలిపింది. తనకున్న అతికొద్ది మంది క్లోజ్ ఫ్రెండ్స్‌లో జేడీ చక్రవర్తి ఒకరని, అయితే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసే విషయంలో పెద్ద అబద్దాలకోరు అని ఆమె వెల్లడించింది. అయితే, కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న రంభ త్వరలో రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈవీవీ సత్యనారాయణ క్లాసిక్ చిత్రం ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన రంభ.. ‘బావగారు బాగున్నారా’ మూవీతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక అదే క్రమంలో దర్శకేంద్రుడి దర్శకత్వంలో.. జేడీ చక్రవర్తి హీరోగా బొంబాయి ప్రియుడు మూవీలో హీరోయిన్ గా చేసింది. ఆ చిత్రంతో రంభ, జేడీ బెస్ట్ ఫ్రెండ్స్ అయినట్టు చెప్తారు. వీరిద్దరి కేరీర్ లో బొంబాయ్ ప్రియుడు ఒక మైలురాయి అంటారు. అయితే తనకి అంతటి క్లోజ్ ఫ్రెండ్ అయిన రంభ విషయంలో జేడీ ఎందుకు అప్సెట్ అయ్యాడో అన్నది తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి :
ఇండస్ట్రీ పెద్దరికంపై మరోసారి చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
రాధిక నుంచి నాగలక్ష్మి వరకు…. 2022 రౌండప్
మరో వివాదంలో రష్మిక.. సౌత్ ఇండస్ట్రీపై వెగటు కామెంట్స్
ఎర్రి వెధవలని చేసి.. ఏం తేలినట్టు నటించటం ఏంటక్కా ?
నన్ను కోవర్ట్ అన్న కాంగ్రెస్సోడిని చెప్పుతో కొడతా..ఎమ్మెల్యే జగ్గారెడ్డి విశ్వరూపం