విడాకులు ఇవ్వాలని సమంతకు ఫ్యాన్ రిక్వెస్ట్.. ఆమె రిప్లై సూపర్ - MicTv.in - Telugu News
mictv telugu

విడాకులు ఇవ్వాలని సమంతకు ఫ్యాన్ రిక్వెస్ట్.. ఆమె రిప్లై సూపర్

November 5, 2020

అభిమాన సినీతారలను పెళ్లి చేసుకోవాలనే కోరిక ఎవరికైనా సహజమే. కుర్రాళ్లలో ఇది మరీ విపరీతంగా ఉంటుంది. పెళ్లయి పిల్లలున్న వాళ్లను కూడా ప్రేమిస్తూ, పెళ్లి చేసుకోమంటూ వేధించే వాళ్లు కోకోల్లలు. సోషల్ మీడియా లేని రోజుల్లో రక్తంతో ఉత్తరాలు,  హీరోయిన్ల ఇళ్లుముందు పడిగాపులు ఉండేవి. కాలం మారిపోయింది. హీరోయిన్లకు డైరెక్టుగా కోరికను చెప్పేసే సదుపాయం వచ్చేంది. వారితో ఏదైనా వాగే స్వేచ్ఛ కూడా లభించింది. 

అభిమానులతో చిట్ చాట్ చేయడం హీరోయిన్లకు కూడా సరదానే. అయితే టాప్ హీరోయిన్ సమంతకు ఓ అభిమాని చిట్టిచాటలో పెద్ద షాకిచ్చాడు. ‘ఫీలింగ్ గుడ్’ అంటూ ఆమె తన ఫోటోను షేర్ చేయగా అది అతనికి తెగ నచ్చేసింది. ‘చైతన్యకు విడాకులు ఇచ్చెయ్. మనిద్దరం పెళ్లి చేసుకుందాం’ అని కోరిక వెళ్లగక్కడాడు. దీనికి ఆమె కూడా ఏమాత్రం తగ్గకుండా దిమ్మదిరిగే జవాబు ఇచ్చింది. `కష్టం.. ఒక పని చెయ్.. చైని అడుగు` అని సలహా ఇచ్చింది. నోటిదూలకు తగిన శాస్తి జరిగిదన నెటిజనం ఆమెను తెగ మెచ్చుకుంటున్నారు. సమంతకు చాట్లలో ఇలాంటి వింత డిమాండ్లు తరచూ వస్తుంటాయి. ఎప్పుడ పిల్లలను కంటావని ఓ అభిమాని అడిగాడు. అందుకామే తాను పెళ్లియినప్పటి నుంచి గర్భవతిగానే ఉన్నానని కౌంటర్ ఇచ్చింది.