అనారోగ్యం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టాప్ హీరోయిన్ సమంతకు ఏవేవో కష్టాలు దాపురిస్తున్నాయి. ఆమె తాజాగా ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్ షూటింగ్‌లో గాయపడింది. చేతులకు గాయాలయ్యాయి. రక్తగాయాలైన చేతుల ఫోటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. బాలీవుడ్ అగ్ర హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ థ్రిల్లర్ చిత్రీకరణలో ఓ పోరాట ఘట్టంలో గాయపడినట్లు ఆమె చెప్పుకొచ్చింది.
దీంతో అభిమానులు ఆమెకు సానుభూతి తెలుపుతూ త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. మయోసైటిస్ అనే కండరాల బలహీన వ్యాధితో బాధపడుతున్న సమంత గత ఏడాది ‘యశోద’ చిత్రంలో ప్రేక్షకులను అలరించింది. కాస్త కోలుకోగానే వెబ్ సిరీస్ బాట పట్టింది. ఆమె తాజా తెలుగు చిత్రం ‘శాకుంతం’ ఏప్రిల్ 14న విడుదల కానుం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించారు.
https://www.instagram.com/stories/samantharuthprabhuoffl/3047896378256436725/