heroine swetha basu prasad career ends due to prostitution
mictv telugu

దానికి బానిసై.. జీవితం నాశనం

November 13, 2022

కొత్తబంగారు లోకంలో విహరిద్దామనుకుంది.. కానీ చెడు కోరికలకు బానిసై జీవితం నాశనం చేసుకుంది. చేసిన తోలి చిత్రంతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కానీ కెరీర్ కొనసాగించలేక చతికిలపడింది. ఎన్నో కళలతో కళారంగానికి వచ్చి తప్పులు చేసేవారికి కనువిప్పు కలిగించే కథగా మిగిలిపోయింది. ఆమె హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. దిల్ రాజు బ్యానర్ లో వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన కొత్తబంగారు లోకం చిత్రం శ్వేతకి ఎనలేని కీర్తిని ఇచ్చింది. ఆ తర్వాత అనుకోకుండా సె** రాకెట్ నడుపుతూ పట్టుబడడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఆ వెంటనే బాలీవుడ్ బాట పట్టిన శ్వేతా బసు ప్రసాద్ రెండు సంవత్సరాల క్రితం దర్శకుడు రోహిత్ మిట్టల్ ను వివాహం చేసుకుంది. దాంతో శ్వేతా కష్టాలు తీరి పద్దతిగా సంసారం చేసుకుంటుంది అనుకున్నారు. కానీ ఊహించింది జరుగుతే అది జీవితం ఎందుకు అవుతుంది. అంత సవ్యంగా సాగుతున్న తన సంసారం జీవితంలో అనుమానమనే భూతం రావటంతో భర్త విడాకులు ఇచ్చేశాడు. జల్సాలకు అలవాటు పడ్డ శ్వేతా బసు పెళ్లయ్యాక కూడా కొన్ని తప్పులు చేయటంతో భరించలేని భర్త విడాకులు తీసుకున్నాడు. కేవలం 8నెలల్లో తన వైవాహిక బంధం ఎండ్ అవుతుందని శ్వేతా ఊహించి ఉండదేమో.

అయితే విడాకుల దెబ్బ నుండి కోలుకుని మళ్ళీ కెరీర్ పై ఫోకస్ పెడదామనుకుంటే.. దర్శక నిర్మాతలు ఆమెని దూరం పెట్టేశారు. చిన్నపాత్రలైనా ఒకే అని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగితే కనీసం దెగ్గరికి కూడా రానివ్వలేదు మేకర్స్. కెరీర్ లో ఎర్లీగా వచ్చిన సక్సెస్ ని హ్యాండిల్ చేయటంలో శ్వేతా విఫలమైంది. సరైన నిర్ణయాలు తీసుకోవటంలో బోల్తాపడి.. కనీసం కుటుంబం గడవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులను ఎదుర్కొంది. దాంతో వేరే గత్యంత్రం మళ్ళీ వ్యభిచారం రొంపిలోకి దిగి తాజాగా పోలీసులకి చిక్కింది. కెరీర్ బిగినింగ్ లో విపరీతమైన జల్సాలకు అలవాటుపడిన శ్వేతా బసు.. చాలీచాలని డబ్బులకు అడ్జెస్ట్ అవ్వలేక టాలీవుడ్ లో ఉన్న కొంతమంది బ్రోకర్ల చేతికి చిక్కి వారి మాయమాటలు నమ్మి డబ్బులు వస్తాయని, అత్యాశతో వ్యభిచారం చేయడానికి కూడా ఓకే అనేసింది. తప్పులు చేసైనా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్న ఆలోచన తన కెరీర్ నే నాశనం చేసింది. ఇండస్ట్రీలో బడా నిర్మాతలతో, రాజకీయా వేత్తలతో శ్వేతా బసు ప్రసాద్ వ్యభిచారం చేసిందని వార్తలు కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. స్టార్ హీరోయిన్ కావాలని పిచ్చితో ఇలాంటి పని చేసింది అంటూ ఈమెపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.