అన్నపూర్ణ బ్యానర్లో అమ్మగా టాబు ! - MicTv.in - Telugu News
mictv telugu

అన్నపూర్ణ బ్యానర్లో అమ్మగా టాబు !

August 2, 2017

‘ నిన్నే పెళ్ళాడుతా ’ సినిమాలో పండు పాత్రలో ఒదిగిపోయిన క్యూట్ టాబు చాలా మందికి గుర్తుండే వుంటుంది. ఆ తర్వాత ప్రేమదేశం, ఆవిడ మా ఆవిడే, ఇదీ సంగతి.., వంటి ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న నటి టాబు. ఇప్పుడు హీరోయిన్ గా రిటైర్ అయి తల్లి పాత్రలో మెరుస్తోంది. అక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న రెండో సినిమాలో అతనికి మదర్ గా నటిస్తోంది. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దర్శకుడి సూచన మేరకు టాబు ఈ సినిమాలో తల్లి పాత్రకు ఓకే చెప్పింది. అన్నపూర్ణ బ్యానర్లో రూపుదిద్దుకుంటున్న సినిమా అవడంతో వెంటనే ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఎన్నో అవార్డులు కూడా గెలుచుకొని హీరోయిన్ గా కెరీర్ లో దూసుకుపోయిన టాబు ఈ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలను సెలెక్ట్ చేస్కొని చేస్తోంది.

ఇలా అకస్మాత్తుగా మదర్ క్యారెక్టర్లకు టర్న్ తీస్కోవడం చాలా ఆశ్చర్యంగా వున్నా పరిస్థితులను బట్టి మోల్డ్ అవడమే వివేకులు చేసే పని అనుకున్నట్టుంది. కుర్ర హీరోయిన్లు కుప్పలు తెప్పలుగా వస్తుంటే ఏజ్ బార్ అవుతున్న తననెవరు హీరోయిన్ గా పెట్టి సినిమాలు తీస్తారనుకున్నట్టుంది. అందుకే సడన్ గా రైట్ టర్న్ తీసుకుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. తనతో నటించిన నాగార్జున ఇంకా హీరోగా కొనసాగుతున్నాడు. తను మాత్రం అప్పుడే ఇలా.. అనే చిన్న నెర్వెస్ నెస్ వుండొచ్చు. బట్ మన దగ్గర హీరోయిన్లకు చలా తక్కువ ఫ్యూచర్ వుంటుందనేది మెల్లగా తెలుసుకున్నట్టుంది. ఇలాగే చూస్తుండగానే ఈమెలా చాలా మంది హీరోయిన్లు మదర్, గ్రాండ్ మదర్ రోల్స్ చేసినా చేసేస్తారు.