Heroine Tamanna bouncers attack on Telugu journalists
mictv telugu

తెలుగు జర్నలిస్టులపై హీరోయిన్ తమన్నా బౌన్సర్ల దాడి.

September 17, 2022

అన్నపూర్ణ స్టూడియోలో హీరోయిన్ తమన్నా బౌన్సర్లు హల్ చల్ చేశారు. ఓ ప్రెస్ మీట్ కోసం అక్కడికి వచ్చిన మీడియా వారిపై దురుసుగా ప్రవర్తించారు. అన్నపూర్ణ స్టూడియోలో హీరోయిన్ తమన్నా నటించిన ‘బబ్లీ బౌన్సర్’ మూవీ ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రోగ్రామ్ కోసం మూవీ టీమ్ 10 మందికి పైగా బౌన్సర్ లను ఏర్పాటు చేసుకుంది. ప్రెస్ మీట్ ముగిశాక.. మీడియా ప్రతినిధులు తమన్నా ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించారు. తమన్నాతో ఇంటర్య్వూ తీసుకునేందుకు రిపోర్టర్ల ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో .. రంగంలోకి దిగిన బౌన్సర్లు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలోనే మరికొందరు బౌన్సర్లు రిపోర్టర్లపై పిడిగుద్దులు కురిపించారు.

దీంతో రిపోర్టర్లు.. కెమెరామెన్లు ఏకమై వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడున్న బౌన్సర్ లు ఓవర్ యాక్షన్ చేశారు. బౌన్సర్ లకు, మీడియా ప్రతినిధులకు మధ్య మాటామాటా పెరిగి తోపులాట జరిగింది. ఈ ఘటనలో కెమెరామెన్ యుగంధర్, శ్రీనివాస్ లకి గాయాలయ్యాయి. అనంతరం విషయం తెలుసుకున్న చిత్ర బృందం మీడియాకు సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. జరిగిన దానికి చింతిస్తున్నట్లు ప్రకటించింది.