మళ్లీ తెరపైకి ‘ఒకే ఒక్క చాన్స్’ సంగీత, నిరోషా.. - MicTv.in - Telugu News
mictv telugu

మళ్లీ తెరపైకి ‘ఒకే ఒక్క చాన్స్’ సంగీత, నిరోషా..

March 16, 2019

తెలుగు సినిమాల్లోకి  ‘ఒకే ఒక్క ఛాన్స్’ అంటూ ఖడ్గం సినిమాలో నటించి, తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ సంగీత. సక్సెల్ ఫుల్‌గా సినిమాలు చేస్తూ మంచి విజయాలను సొంతం చేసుకున్న సంగీత.. ఆ తర్వాత తమిళంలోనూ అడుగుపెట్టి హిట్ల మీద హిట్లు కొట్టింది. మ్యూజిక్ డైరెక్టర్ క్రిష్ ను పెళ్లి చేసుకున్న సంగీత ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. కొద్ది రోజులుగా ఆమె బుల్లితెరలో పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి, కొన్ని సినిమాల్లో కూడా కనిపించారు. సంగీత దాదాపు రెండేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ వెండి తెరపై కనిపించనున్నారు.

Heroines Sangeetha, Nirosha Re-Entry to Tollywood...

విజయ్‌ ఆంటోని హీరోగా నటిస్తున్న ‘తమిళరసన్‌’ చిత్రంలో సంగీత కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను ఎస్‌ఎన్‌ఎస్‌ మూవీస్‌ బ్యానరుపై కౌసల్య రాణి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా సంగీత మాట్లాడుతూ.. ‘నా పెళ్లి తర్వాత అనేక సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అందులో పాత్రలు నచ్చకే నేను అంగీకరించలేదు. తమిళరసన్‌లో ప్రాముఖ్యత కలిగిన పాత్ర పోషిస్తు‌న్నా’ అని  పేర్కొన్నారు.

అలాగే చాలా ఏళ్ల తర్వాత హీరోయిన్ నిరోషా మళ్లీ తెలుగులోకి అడుగుపెట్టనుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిరోషా తాజాగా తెలుగులో ‘నువ్వు తోపురా’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా పవర్ఫుల్‌గా ఉంటుందన్నారు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుధాకర్.. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు హరనాథ్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. సుధాకర్‌కు జోడీగా నిత్యా శెట్టి నటించింది.