అలాంటి సీన్లుంటే ‘ ఎ ’ సర్టిఫికేట్.. పహ్లాజ్ నిహ్లాని ! - MicTv.in - Telugu News
mictv telugu

అలాంటి సీన్లుంటే ‘ ఎ ’ సర్టిఫికేట్.. పహ్లాజ్ నిహ్లాని !

July 25, 2017

ఇక నుండి సినిమాల్లో హీరోలు సీన్ డిమాండ్ చేసిందని పొగ త్రాగటం, మద్యం సేవించడం వంటివి చేయకూడదని తెలిపారు CBFC ( సెన్సార్ బోర్డు ) చీఫ్ పహ్లాజ్ నిహ్లాని. అలాంటి సీన్లు వున్న సినిమాలకు ‘ ఎ ’ ( అడల్ట్స్ ) సర్టిఫికేట్ జారీ చేస్తున్నట్టు కూడా తెలిపారు. సినిమాలో అత్యంత అవసరమైతే తప్ప పొగ తాగటం, మద్యం సేవించడం వంటి సీన్లు హీరోలు అస్సలు చెయ్యకూడదు అంటున్నారు. హీరోలు సమాజానికి మార్గదర్శకాలుగా నిలబడాలి గానీ ప్రేక్షకులను తప్పుదోవ పట్టించకూడదు అంటున్నారు. ధూమపానం, మద్యపానం తాగుతున్నప్పుడు స్ర్కీన్ మీద ‘ ధూమపానం, మధ్యపానం ప్రాణానికి హానికరం ’ అని టెక్ట్స్ వేసినప్పటికీ దాని ప్రభావం వుండటం లేదు. ఎందుకంటే అక్కడ చూసేవారి దృష్టి పొగ తాగుతున్న హీరో మీద తప్ప ఆ టెక్ట్స్ మీద వుండటం లేదు. అందుకే అలాంటి సీన్స్ ను పూర్తిగా పెట్టకపోతేనే బెటర్ అంటున్నారు నిహ్లానీ.

అలాంటి సీన్ల వల్ల చూసే ప్రేక్షకులను రెచ్చగొట్టినట్టే అవుతుంది తప్పితే పెద్దగా ఒరిగేది ఏం లేదంటున్నారు. నిజమే కదా సినిమాల్లో హీరోలు వేసే వేషాలను చాలా మంది గుడ్డిగా ఫాలో అవుతుంటారు. కాబట్టి ఇలాంటి దురలవాట్లను తెర మీద చూపించి రెచ్చగొట్టడం అవసరమా అనేది సెన్సార్ బోర్డు వాదన ? థియేటర్లో సినిమా ప్రారంభానికి ముందు ధూమపానానికి సంబంధించిన యాడ్స్ వేసి మళ్ళీ సినిమాలో హీరోలు పొగ తాగుతున్నట్టు చూపించడం వల్ల ప్రభావం ఏమీ వుండలేకపోతోంది. కొన్ని థర్డ్ క్లాస్ కంపెనీలకు హోస్టులుగా పని చేస్తున్న సెలెబ్రిటీల మీద ఆ మధ్య కేసులు కూడా నమోదయ్యాయి. అలాగే ధూమపానంకు సంబంధించిన విషయంలో కూడా ఆ బాధ్యతను హీరోల మీద వదిలేసినట్టే వుంది. చూడాలి మరి హీరోలు ఎంత మేరకు ఇలాంటి సీన్లను నిరాకరిస్తారో !?

 

https://scroll.in/latest/844908/actors-should-set-an-example-no-more-smoking-drinking-in-movies-says-cbfc-chief-pahlaj-nihalani