టాలీవుడ్ మెయిన్ హీరోలు విశాల్, కార్తీలతో పాటు విలక్షణ నటుడు నాజర్లపై రాజదురై అనే వ్యక్తి హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు ధర్మరాజ్ అనే వ్యక్తి తేనాంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విశాల్, కార్తీ మరియు నాజర్ దక్షిణ భారత నటీనటుల సంఘానికి నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. కాగా ఆ సంఘంలోని ఓ సభ్యుడు, సహాయ నటుడైన రాజదురై.. ఆ ముగ్గురిపై హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సంఘం అధికారి ధర్మరాజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆ ముగ్గురూ సంఘం సంక్షేమం కోసం నిరంతరం పాటు పడుతున్నారన్నారని, అలాంటివారిపై సహాయ రాజదురై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుండడం తగదన్నారు. ఇలాంటివి సంఘ నిర్వాహకులను అప్రతిష్టపాలు చేసేవిగా ఉన్నాయన్నారు. దీంతో అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని ధర్మరాజ్ కోరారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజదురైను ప్రశ్నిస్తున్నారు.