హీరో వరుణ్ సందేశ్ భార్య చెప్పేది నిజమేనా..?అసలేం జరిగింది...? - MicTv.in - Telugu News
mictv telugu

హీరో వరుణ్ సందేశ్ భార్య చెప్పేది నిజమేనా..?అసలేం జరిగింది…?

July 12, 2017

“హీరో వరుణ్ సందేశ్ కు నాకు ఎలాంటి విభేదాలు లేవు.మేము ఇద్దరం చాల సంతోషంగా ఉన్నాం.నిద్ర రాకపోవడం తో తొలుత ఒకటి, తర్వాత మూడు నిద్ర మాత్రలు వేసుకున్నాను.అంతే తప్ప నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకోలేదు” ఇది హీరో వరుణ్ సందేశ్ భార్య వితిక శేరు చెప్పిన మాటలు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది.? ఎస్ వితిక మాటలే వాస్తవం అనుకుందాం…కానీ నిద్ర రాకపోతే..ఎవరైనా..ఒక మాత్ర మింగుతారు. ఆ ఒక్క దాంతోనే నిద్ర పట్టేస్తుంది. అయినా డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా వీటిని ఇవ్వరు..ఇచ్చినా రోజుకు ఒకటికి మించి వేసుకోవద్దు… అని స్ట్రిక్ట్ గా చెబుతారు. మరి నాలుగు నిద్ర మాత్రలు మింగాల్సిన అవసరం ఏమొచ్చింది వితికకు.

సూసైడ్ అటెంప్ట్ చేసుకునే దాన్నయితే 40 మాత్రలు మింగేదాన్ని..అని అంటోంది. ఆత్మహత్య చేసుకోనేటోళ్లు ఆరేడు మింగినా ఔట్..పది మింగితే డెత్ కన్ ఫామ్ అని డాక్టర్లు చెబుతుంటారు. మరి వితికకు నాలుగైదు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం ఉందా..?

యుఎస్ నుంచి వచ్చాను కదా.. టైమింగ్స్ లో తేడా వల్ల నిద్రరావడం రావడం లేదు..అని ఇంకొక కారణం చెబుతోంది. సరే నుంచి అమెరికా వచ్చినవాళ్లకు మూడు,నాలుగు రోజులు నిద్ర సమస్యలు ఉండటం కామన్. కానీ ఎవరూ ఇంతవరకు ఈ కారణం చెప్పి నాలుగైదు నిద్రమాత్రలు మింగి ఆసుపత్రికి వెళ్లిన సందర్భాల్లేవ్.

మరో మాట ఆషాడం కావడంతో… అమ్మవాళ్లను చూసేందుకు హైదరాబాద్ వచ్చానని అంటోంది. ఇది ఆర్నెళ్ల ముందే డిసైడ్ అయిన టూర్. వరుణ్ సందేశ్ ఎన్ని సినిమాలు ఉన్నా… ఈమె వచ్చే సరికి హైదరాబాద్ లోనే ఉండేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటాడు. మరి ఎందుకు అలా చేసుకోలేదు..ఈమె ఇటొస్తే..ఆయన అటేందుకు పోయాడు..ఇదే ఇప్పుడు పెద్ద డౌట్. అయినా ఈ కాలంలో ఆషాడం ఎవరు పాటిస్తున్నారు.మరి సినిమా కథలు కాకపోతే..

అమెరికాలో వరుణ్ తో గొడవ జరుగలేదు అని చెబుతోంది వితిక..ఈ మాటే నిజం అనుకుంటే టూర్ క్యాన్సిల్ చేసుకుని వరుణ్ తో పాటు అమెరికాలోనే ఉండొచ్చు కదా…ఎందుకు హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ఈమె రాకపోతే ఫంక్షన్ ఆగిపోయేదా..బెంగతో అమ్మవాళ్లు మంచం పట్టేవాళ్లా..? వినేటోళ్లు వీపీ అయితే కవరింగ్ కోసం ఏదైనా చెప్పేస్తుంటారు. ఇలాగే వితిక శేరు తరీక..

కుటుంబ సలహాలు అసలే లేవంటోంది. సూసైడ్ అటెంప్ట్ చేయలేదంటోంది. స్టార్ హాస్పిటల్స్ లో బెడ్ మీద ఉన్న ఫోటోలు చూస్తే సిచ్యూయేషన్ ఎంత సీరియస్ గా ఉందో అర్థం అవుతుంది. డాక్టర్ల ట్రీట్ మెంట్ తో స్పీడ్ గా రికవరీ అయింది. ఆవేశంలో చేసిన పనికి ఎక్కడ వరుణ్ సందేశ్ కు చెడ్డ పేరు వస్తుందో..కేరీర్ కు మచ్చ వస్తుందేమోనని భయపడ్డట్టుంది. మీడియాతో మాట్లాడుతూ కెమెరా కు కన్నీళ్లు కన్పించకుండా ఏలాంటి విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేసింది. అంతేకాదు లేని నవ్వు ను తెచ్చుకునే ప్రయత్నం చేసింది.

వరుణ్ సందేశ్ , వితకకు పెళ్లి అయి సరిగ్గా ఏడాది కావొస్తోంది. 11 నెలలు చక్కగా సాగిన కాపురంలో చిచ్చు రేగింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందనే వార్త వైరల్ అయింది. అన్ని రూమర్స్ అని వితిక బ్రేక్ వేసింది. వోకే వోకే ఆమెన్నట్టు సంతోషంగా ఉన్నాం..పుకార్లు నమ్మొద్దు అని ట్వీట్ చేసింది. ఖుషీ ఖుషీగా ప్రేమ ఇష్క్ కాదల్ తో హ్యాపీ డేస్ గడిపితే ఇంతకన్నా జనానికి కావాల్సింది ఏముంది. మీ వైపు మీడియా కూడా ఎందుకు కన్నెత్తి చూస్తుంది. అసలు చూడదు..అయిందేదో అయింది ఇకముందైనా ఇలాంటి రూమర్స్ రాకుండా చూసుకోండి..అసలే ఇంతకు ముందు డ్రగ్స్ కేసులో చిక్కుకున్న వరుణ్ సందేశ్ కు..ఇలాంటివి జరిగితే కేరీర్ ఫుల్ స్టాప్ పడొచ్చు..బీ కేర్ ఫుల్

 

.