ఖర్చులకు వెనకాడం.. విద్యార్ధులను తీసుకురండి: కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఖర్చులకు వెనకాడం.. విద్యార్ధులను తీసుకురండి: కేటీఆర్

February 25, 2022

ktr

ఉక్రెయిన్‌ దేశంలో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్ధులను మన దేశానికి తీసుకురావడానికి ఎంత ఖర్చు అయిన సరే భరిస్తామని, వారిని వెంటనే ఇండియాకు తీసుకురావాలని కేటీఆర్ విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ట్వీట్ చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయాలి. అందుకు అవసరమైన ఖర్చులు భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉంది. కావున వెంటనే కేంద్రం చర్యలు చేపట్టాలి” అని కేటీఆర్ కోరారు.

మరోపక్క ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థుల కోసం దిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ఫోన్ చేసి విద్యార్థులను క్షేమంగా ఇండియాకు తీసుకురావాలని విజ్జప్తి చేశారు.