హెటిరో కరోనా మాత్రల ప్యాకెట్.. ధర రూ. 2,640 - MicTv.in - Telugu News
mictv telugu

హెటిరో కరోనా మాత్రల ప్యాకెట్.. ధర రూ. 2,640

September 25, 2020

nvnv

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ హెటిరో హెల్త్‌కేర్ కరోనా వైరస్ నిరోధానికి మందును రూపొందించిన సంగతి తెలిసిందే. కరోనా మాత్రతల ధరలు మొదట్లో భారీగా ఉన్నా తర్వాత తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో హెటిరో కూడా అందుబాటు ధరలో జెనరిక్ ప్యాక్ తీసుకొచ్చింది. ఫావివిర్ 800/200 ప్యాకెట్ ధరను రూ. 2,640గా ప్రకటించింది. ఇందులో ఫావిపిరవిర్ మాత్రలు 800ఎంజీ మోతాదువి 16 ఉంటాయి. 200ఎంజీవి 2 ఉంటాయి. 

తక్కువ, మంద్రస్థాయి కరోనా లక్షణాలతో బాధపడేవారు వీటిని పుచ్చుకోవచ్చని కంపెనీ చెబుతోంది. వీటికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆమోదం ఉందని, రోగులకు మరింతగా అందుబాటులో ఉంచేందుకు ఈ ప్యాక్ తీసుకొచ్చామని హెటిరో హెల్త్ కేర్ లిమిటెడ్ వెల్లడించింది. అన్ని రిటైట్ మెడికల్ షాపుల్లో,  హాస్పిటల్ ఫార్మసీల్లో ఈ ప్యాక్ లభిస్తుందని పేర్కొంది. హెటిరో జూలై 29న ఫావివిర్ బ్రాండ్ పేరుతో ఫావిపిరవిర్ ఔషధాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.