సచివాలయం కూల్చివేతకు హైకోర్టు బ్రేక్  - MicTv.in - Telugu News
mictv telugu

సచివాలయం కూల్చివేతకు హైకోర్టు బ్రేక్ 

July 10, 2020

High court breaks demolishion of telangana old secetariat

సచివాలయం కూల్చివేతకు హైకోర్టు బ్రేసింది. కూల్చివేత పనులను సోమవారం వరకు ఆపేయాలని ఈ రోజు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కూల్చివేత వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో కాలుష్యం అలముకుంటోందని సామాజిక కార్యాకర్త పీఎల్ విశ్వేశ్వర రావు వేసిన పిటిషన్‌ను కోర్టు విచారిస్తోంది. దీనిపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం లేదని రెండు రోజు కిందట వ్యాఖ్యానించిన కోర్టు ఈ రోజు పై ఆదేశాలు జారీ చేసింది.  

‘ప్రస్తుతం కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ భవనాలను కూల్చివేస్తున్నారు. భవనాల కూల్చివేయడం వలన వాతావరణం కాలుష్యం అవుతోంది. మున్సిపాలిటీ సాలీడ్ వెస్ట్ మ్యానేజిమెంట్ నిబంధనలను పట్టించుకోకుండా కూల్చివేత చేపడుతున్నారు’ అని పిటిషనర్ పేర్కొన్నారు. ఆయన వాదనలు విన్న కోర్టు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూల్చివేత విషయంలో ముందుకు సాగొద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అయితే కూల్చివేత ఇప్పటికే 60 శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం 15 రోజుల్లోగా కూల్చివేత పనులు సాగుతాయని అధికారులు ఇదివరకు చెప్పారు. మరోపక్క కోర్టు నుంచి తమకింకా ఆదేశాలు అందలేదని సచివాలయ సిబ్బంది అంటున్నారు. మంగళవారం నుంచి కూల్చివేత పనులు మొదలయ్యాయి.