తెలంగాణ సర్కారుకు చుక్కెదురు

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ నియామకాలను కోర్టు శుక్రవారం రద్దు చేసింది. కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకల్లో నిబంధనలను ఏమాత్రం పాటించలేదని మండిపడింది. చైర్మన్తో పాటు సభ్యుల నియామకాలు చెల్లవని స్పష్టం చేసింది. నియామకాలు సంబంధిత మంత్రి సమక్షంలో జరగలేదని ఆక్షేపించింది.

కమిషన్ నియామకాలు.. 2005నాటి బాలల హక్కుల పరిరక్షణ చట్టానికి అనుగుణంగా లేవని, అవకతవకలు జరిగాయని హైదరాబాద్ లోని బాలల హక్కుల సంఘానికి చెందిన అచ్యుత రావు గతంలో కోర్టులో పిటిషన్ వేశారు. కేసును విచారించిన కోర్టు ఆగస్టులో నియామకాలపై స్టే విధించింది.

SHARE