Home > Featured > ఎమ్మెల్సీ అనంతబాబుకు భారీ ఊరట.. హైకోర్టు ఆదేశాలతో

ఎమ్మెల్సీ అనంతబాబుకు భారీ ఊరట.. హైకోర్టు ఆదేశాలతో

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్ట్ అయిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. అరెస్టైన నాటి నుంచి జైల్లోనే ఉన్న అనంతబాబు.. తల్లి చనిపోవడంతో రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు మూడ్రోజులు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలంటూ అనంతబాబు పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఆమేరకు స్పందించి మూడ్రోజులు తాత్కాలిక బెయిల్ ఇచ్చి పలు కఠిన షరతులను విధించింది. అయితే రాజమండ్రి కోర్టు ఇచ్చిన మూడ్రోజుల బెయిల్ తనకు సరిపోదంటూ మరిన్ని రోజులు కావాలని అనంతబాబు మంగళవారం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు.. రాజమండ్రి కోర్టు ఇచ్చిన మూడ్రోజులతో పాటు అదనంగా 11 రోజుల బెయిల్‌ని పొడగించింది. సెప్టెంబర్ 5 దాకా మధ్యంతర బెయిల్‌ను పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Updated : 23 Aug 2022 8:49 AM GMT
Tags:    
Next Story
Share it
Top