High Court has given a green signal to the announcement of Group 1 Prelims exam results
mictv telugu

అభ్యర్ధులకు గుడ్ న్యూస్.. గ్రూప్ 1 ఫలితాల వెల్లడికి హైకోర్టు ఓకే

January 11, 2023

తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ 1 ఫలితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 503 పోస్టులకు అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా, 2 లక్షల 85 వేల 916 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. అక్టోబర్ 29న ప్రాథమిక కీని విడుదల చేయగా, ఓ అభ్యర్ధి స్థానికతపై వివాదం చెలరేగింది. దీనిపై టీఎస్పీఎస్సీ హైకోర్టులో అప్పీల్ చేసింది. విచారించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే అభ్యర్థి స్థానికత వివాదం తర్వాత తేలుస్తామని ఆ లోపు ఫలితాలు వెల్లడించవచ్చని స్పష్టం చేసింది. దీంతో కసరత్తు మొదలెట్టిన అధికారులు సంక్రాంతి లోపు ఫలితాల వెల్లడికి ప్రయత్నాలు చేస్తున్నారు.