High Court is serious about AP Sarkar..you should be in jail
mictv telugu

ఏపీ సర్కార్‌పై హైకోర్టు సీరియస్..మీరు జైల్లో ఉండాలి

September 2, 2022

”పేద విద్యార్ధులు స్కూల్లో ఉండాలి, మీరు జైల్లో ఉండాలి” అంటూ ఏపీ హైకోర్టు జగన్ మోహన్ రెడ్డి సర్కార్‌పై సీరియస్ అయ్యింది. అంతేకాదు, రాష్ట్రంలోని పేద పిల్లలకు విద్యను అందించే విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది అంటూ ఆగ్రహించింది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు కేటాయించే వ్యవహారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తాజాగా హైకోర్టు మండిపడింది. ప్రైవేటు స్కూళ్లలో పేదలకు 25 శాతం సీట్లు కేటాయించాలని విద్యాహక్కు చట్టం చెప్తున్నా, ప్రభుత్వం మాత్రం విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వంలో కీలకమైన సీఎస్‌తోపాటు విద్యాశాఖ అధికారులకు వార్నింగ్ ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ప్రైవేటులో 25 శాతం సీట్లు విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా పేద విద్యార్ధులకు 25 శాతం సీట్లు కేటాయించాలన్న నిబంధనను అమలు చేయకపోవడంపై గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ విషయంపై గతంలో విచారించిన హైకోర్టు.. దీన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని తీర్పు చెప్తూ, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కానీ, విద్యాశాఖ అధికారులు మాత్రం హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా, అమల్లో మాత్రం నిర్లక్ష్యం వహించింది. దీంతో పిటిషనర్ మరోసారి తాజాగా కోర్టును ఆశ్రయించి, హైకోర్టులో కోర్టు ధిక్కార వాజ్యం దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టింది.