శివుడికి కోర్టు నోటీసులు.. రాకపోతే పదివేల ఫైన్ - MicTv.in - Telugu News
mictv telugu

శివుడికి కోర్టు నోటీసులు.. రాకపోతే పదివేల ఫైన్

March 15, 2022

bfgb

పై హెడ్డింగ్ కరెక్టే. ఓ కోర్టు ఏకంగా మహాదేవునికే నోటీసులు జారీ చేసింది. పైగా కోర్టుకు హాజరుకాకపోతే రూ. 10 వేల జరిమానా కూడా విధిస్తామని నోటీసుల్లో హెచ్చరించింది. వినడానికి వింతగా ఉన్న ఈ సంఘటన చత్తీస్‌ఘడ్ రాష్ర్టంలో జరిగింది. వివరాలు.. రాయగఢ్ జిల్లాలో ఒక శివాలయం ఉంది. అయితే ఆ ఆలయాన్ని ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టారనీ, శివాలయంతో సహా మొత్తం 16 మంది భూమిని ఆక్రమించారని సుధారాజ్ వాడే అనే మహిళ బిలాస్‌పూర్ హైకోర్టులో దావా వేసింది. కేసును విచారించిన కోర్టు శివుడితో పాటు 10 మందికి సమన్లు జారీ చేసింది. అంతటితో ఆగక, విచారణకు హాజరు కాకపోతే రూ. 10 వేలు జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వార్త ఆ రాష్ట్రంలో హల్‌చల్ చేస్తోంది. ఒకవేళ ఆలయాన్ని అక్రమంగా కడితే కేసును ఆలయ ధర్మకర్త మీదో లేకపోతే ఆలయ పూజారి మీదనో వేయాలి కానీ, శివుడిపై కేసు వేయడం ఏంటి? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. తెలుగు ప్రజలు మాత్రం ‘గోపాల గోపాల’ చిత్రాన్ని తలుచుకుంటున్నారు.