పార్టీ గుర్తింపు లొల్లి.. వైకాపాకు హైకోర్టు నోటీసు - MicTv.in - Telugu News
mictv telugu

పార్టీ గుర్తింపు లొల్లి.. వైకాపాకు హైకోర్టు నోటీసు

July 13, 2020

notice

ఆంధ్రప్రదేశ్ అధికారంలో పార్టీ వైస్సార్సీపీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెల్సిందే. కడపకు చెందిన అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మహబూబ్ బాషా ఈ పిటిషన్ దాఖలు చేశారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి బదులు వైఎస్సార్ పేరును ఉపయోగించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఎన్నికల కమిషన్, వైఎస్సార్‌సీపీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 3కు వాయిదా వేస్తూ… అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులో పేర్కొంది.

కొద్దీ రోజుల క్రితం నర్సాపురం లోక్ సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పార్టీ తరఫున రఘురామకృష్ణంరాజుకు షోకాజ్ నోటీసు పంపించారు. అందులో విజయసాయిరెడ్డి పార్టీ పేరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా పేర్కొన్నారు. దీనిపై ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యంగ్యంగా స్పందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీస్ ఎలా ఇస్తారన్నారు. ఈ వివాదం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.