తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు గురువారం తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైదరాబాదులోని అత్యంత ఖరీదైన ప్రాంతం బంజారా హిల్స్‌లో అతి తక్కువ ధరకు టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు భూమి ఇవ్వడంపై నాలుగు వారాల్లోగా జవాబివ్వాలని నోటీసులో పేర్కొంది. గతంలో హైదరాబాద్ పార్టీ కార్యలయం కోసం 4935 గజాలను కేవలం రూ. 100 కే ఇవ్వడంపై రిటైర్డ్ ఉద్యోగి మహేశ్వర్ రాజ్ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిని విచారించిన కోర్టు కేసీఆర్‌తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్, సీసీఎల్ఏ, జిల్లా కలెక్టరుకు నోటీసులు జారీ చేసింది.