బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) ఎమ్మెల్యల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సిట్ విచారణ సరిగ్గా జరగనందున కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని సిట్ ను సోమవారం ఆదేశించింది. ఇప్పటివరకు చేసిన దర్యాప్తు వివరాలు సీబీఐకి అందజేయాలని స్పష్టం చేసింది. గత అక్టోబరులో వెలుగులోకి వచ్చిన ఈ ఎమ్మెల్యేల కొనుగోలులో నలుగురు ఎమ్మెల్యేలపై కుట్ర జరిగిందని, ప్రభుత్వాన్ని అస్థిరపరిచడానికి మొయినాబాద్ లోని ఫాంహౌజ్ వేదికగా బేరసారాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా తాజాగా హైకోర్టు సీబీఐకి అప్పజెప్పాలని ఆదేశించడం గమనార్హం. ఇందులో బీజేపీ పిటిషన్ ని కొట్టివేసిన హైకోర్టు.. మిగిలిన పిటిషన్లకు అనుమతినిచ్చింది. కాగా ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.