Home > Featured > సీబీఐకి డాక్టర్ సుధాకర్ కేసు.. పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

సీబీఐకి డాక్టర్ సుధాకర్ కేసు.. పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

DR. Sudhakar.

వివాదస్పదంగా మారిన డాక్టర్ సుధాకర్ కేసును ఏపీ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. శుక్రవారం జరిగిన వాదనల తర్వాత ఈ న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ధర్మాసనం తప్పుబట్టింది. వెంటనే సీబీఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయాలని సూచించింది. 8 వారాల్లోగా దీనికి సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సుధాకర్ తల్లి స్వాగతించారు. ఈ నిర్ణయం తమకు ఆనందం కలిగించిందని అన్నారు.

కాగా నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్న సుధాకర్ ప్రభుత్వం తమకు మాస్కులు ఇవ్వలేదంటూ ఆరోపించాడు. దీంతో అతనిపై క్రమశిక్షణ చర్యల కింద సస్పెన్షన్ వేటు వేశారు. ఆ తర్వాత కొన్ని రోజులుకు ఇటీవల అర్ధనగ్నంగా నడిరోడ్డుపై పిచ్చిగా అరుస్తూ.. కనిపించాడు. అతని చర్యలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అతనిపై పోలీసులు వ్యవహరించిన తీరు వివాదస్పదమైంది. ఆ తర్వాత కేజీహెచ్‌లో చేర్పించగా.. మానసిక పరిస్థితి బాగోలేదని తేల్చారు. ఈ వ్యవహారంపై విపక్షాలు కూడా మండిపడ్డాయి. సుధాకర్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు.

Updated : 22 May 2020 3:55 AM GMT
Tags:    
Next Story
Share it
Top