కేసీఆర్ సర్కార్‌కు హైకోర్ట్ ఆదేశాలు.. వయోపరిమితి పెంపుపై... - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ సర్కార్‌కు హైకోర్ట్ ఆదేశాలు.. వయోపరిమితి పెంపుపై…

May 4, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 28వ తేదీన 503 గ్రూప్-1 పోస్టులకు కేసీఆర్ సర్కార్ నోటీఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించి కొంతమంది అభ్యర్థులు వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 49 ఏళ్లకు పెంచాలని కోరుతూ, టీఎస్‌పీఎస్సీ అధికారులకు వినతిపత్రాలను అందజేశారు. ఈమేరకు హైకోర్టులోనూ పిటిషన్ వేశారు. హైకోర్టు విచారణ జరిపి, అభ్యర్థుల వినతిపై నిర్ణయం  తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కూడిన కౌంటర్లు దాఖలు చేయాలని, విచారణను జూన్ 17వ తేదీకి వాయిదా వేసింది.

మరోపక్క సోమవారం నుంచి గ్రూప్ 1 పోస్టులకు ఆల్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఇప్పటివరకూ 11, 598 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ ఈనెల 31తో గడువు ముగియనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్ 1 అభ్యర్థులకు పలు సమస్యలు ఎదురౌతున్నాయి. ఓవైపు అకాడమీలో పుస్తకాలు లేక, మరోవైపు దరఖాస్తులు చేసేటప్పుడు స్టడీ కండక్ట్స్ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఒక్కసారికి వయోపరిమితిని సడలించాలని కోరుతూ, హైకోర్టులో ఎ.వెంకన్న, మరో అయిదుగురు కలిసి వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది.