High Court sensational orders on marriage age of Muslim girls
mictv telugu

ముస్లింల అమ్మాయిల పెళ్లి వయసుపై హైకోర్టు సంచలన ఆదేశాలు

June 20, 2022

High Court sensational orders on marriage age of Muslim girls

ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిల వివాహ వయస్సుపై పంజాబ్ – హర్యానా హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. షరియా చట్టాల ప్రకారం ఓ ముస్లిం బాలిక 16 ఏళ్ల వయసులో తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చని వెల్లడించింది.

షరియా ప్రకారం పురుషులు, మహిళలను 15 సంవత్సరాల వయస్సు వచ్చాక పెద్దవారిగా పరిగణిస్తారు. వివరాలు.. పఠాన్‌కోట్‌కు చెందిన అబ్బాయి (21), అమ్మాయి (16) జూన్ 8న ఇస్లామిక్ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాలు పెళ్లిని వ్యతిరేకించడంతో పాటు బెదిరింపులకు దిగారు. దీంతో ఆ జంట హైకోర్టును ఆశ్రయించి రక్షణ ఇవ్వాలని కోరారు. విచారించిన సింగిల్ బెంచ్ జడ్జీ జస్జిత్ సింగ్ బేడీ.. వారికి సరైన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించారు. ఇష్టానుసారం చేసుకున్న వివాహం చెల్లుతుందని, వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించలేమని స్పష్టం చేశారు. తన తీర్పులో ముస్లిం వ్యక్తిగత చట్టంపై దిన్షా ఫర్దూన్ జీ రాసిన పుస్తకాన్ని ఉదహరించారు.