ఏపీ సర్కార్‌పై హైకోర్టు మళ్లీ సీరియస్.. ఆ పనులకు బ్రేక్ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ సర్కార్‌పై హైకోర్టు మళ్లీ సీరియస్.. ఆ పనులకు బ్రేక్

February 4, 2020

bnn

ఏపీలో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిన జగన్ సర్కార్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. మూడు ప్రాంతాల్లో కార్యాలకు కావాల్సిన భవనాలు, తరలింపుపై ఫోకస్ పెట్టింది. అమరావతి నుంచి కార్యాలయాల తరలింపును నిరసిస్తూ గతంలో రైతులు కోర్టును ఆశ్రయించడంతో ఈనెల 26 వరకు స్టే విధించింది. దీంతో తరలింపు నిలిచిపోయింది. కానీ ఇటీవల విజిలెన్స్ కార్యాలయాన్ని తరలించేందుకు ప్రభుత్వం జీవో ఇవ్వడంతో మరోసారి సీరియస్ అయింది. 

పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా కార్యాలయాలను ఎలా తరలిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను ఎందుకు బేఖాతరు చేశారని మండిపడింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం తరుపు న్యాయవాది మూడు రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ధర్మాసనానికి తెలిపారు. కాగా విజిలెన్స్ కార్యాలయాన్ని కర్నూల్‌కు తరలిస్తూ శుక్రవారం ఓ జీవో విడుదలైంది. కొంత మంది రైతులు పిటిషన్ దాఖలు చేయడంతో దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టి ఆగ్రహం వ్యక్తం చేసింది.