ప్రభుత్వ ఆఫీసులకు వైసీపీ రంగులపై హైకోర్టు సీరియస్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభుత్వ ఆఫీసులకు వైసీపీ రంగులపై హైకోర్టు సీరియస్

December 13, 2019

High Court.

ఏపీలో రంగుల వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికార పార్టీకి చెందిన రంగులను ప్రభుత్వ సముదాయాలకు వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో పంచాయితీ కార్యాలయానికి వైసీపీ రంగులు వేయడంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరుపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. 

ఈ అంశంపై పూర్తి విరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఎటువంటి అధికారాలతో ఇలా రంగులు వేస్తారంటూ ప్రశ్నించారు. పది రోజుల్లో దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని గుంటూరు కలెక్టర్‌ను ధర్మాసనం ఆదేశించింది. కాగా గత కొన్ని రోజులుగా ఏపీలో ప్రభుత్వ సముదాయాలకు అధికార పార్టీ రంగులు వేస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై విపక్షాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.