high security restrictions at Uppal stadium
mictv telugu

మ్యాచ్ చూడ్డానికి వెళుతున్నారా…అయితే వీటిని వదిలేసి వెళ్ళండి

January 18, 2023

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ కు రాచకొండ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2, 500 మంది సెక్యూరిటీతో కట్టుదిట్టంగా రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు.మైదానం చుట్టూ, వాహనాల పార్కింగ్ ఇలా మొత్తం 300 సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షించనున్నారు. ఒక ఉమ్మడి కంట్రోల్ రూమ్ కూడా ఉర్పాటు చేశారు. చాలా రోజులు తర్వాత హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుతున్న కారణంగా దీనికి వేలాది మంది ప్రేక్షకులు రానున్నరని….అందుకే ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాచకొండ కమీషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు.

మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలోకి మొబైల్ ఫోన్లు తప్ప ఏమీ అనుమతించడం లేదు. మంచినీళ్ళు స్టేడియంలోనే దొరుకతాయని చెప్పారు. స్టేడియంలోకి ల్యాప్ టాప్, బ్యానర్లు, నీళ్ళసీసాలు, కెమెరాలు, సిగరెట్లు, ఎలక్ట్రీనిక్ వస్తువులు, అగ్గిపెట్టె, లైటర్, పదునైన వస్తువులు, బైనాక్యులర్లు, నాణేలు, పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్, ఫర్ఫ్్యూమ్, బ్యాగ్స్, తినుబండారాలు మీద నిషేధం విధించారు. మోబైల్ ఫోన్లను కూడా తనీఖీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తామని చెప్పారు.దీని కోసం ప్రతీ గేటు దగ్గర నలుగురు సాంకేతిక సిబ్బందిని నియమించారు.

ఈరోజు 10.30 నుంచి ప్రేక్షకులను లోపలికి అనుమతిస్తారు. నడుచుకుంటూ వచ్చే వాళ్ళు ఏ గేట్ లోంచి అయినా రావొచ్చు. అదే బైక్ మీద వచ్చే వాళ్ళు అయితే బీ దగ్గర పార్కింగ్ చేయాలి. కార్ పాస్ ఉన్న వాళ్ళు రామాంతపూర్ వైపు నుంచి వచ్చి ఏ, బీ ప్రాంతాల్లో పార్కింగ్ చేయాలి.