సాయి గణేష్ సూసైడ్ కేసు.. మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు - MicTv.in - Telugu News
mictv telugu

సాయి గణేష్ సూసైడ్ కేసు.. మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు

April 22, 2022

 

ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేష్ కేసులో హైకోర్టు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. మంత్రితో పాటు ఎనిమిది మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అంతేకాక, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ, తదుపరి విచారణను 29కి వాయిదా వేసింది. ఇంతకుముందు సాయి గణేష్ ఆత్మహత్యపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అనంతరం పిటిషనర్ తరపున న్యాయవాది అభినవ్ వాదిస్తూ.. పోలీసులు వేధింపులు తాళలేక సాయి గణేష్ సూసైడ్ చేసుకున్నాడని తెలిపారు. దీనిపై అడ్వకేట్ జనరల్ ప్రసాద్ మాట్లాడుతూ.. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నాం. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలనడంతో కోర్టు అందుకు అంగీకరించింది. ఇదిలా ఉండగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక కమ్మ మంత్రినైన తనపై కుట్ర జరుగుతోందంటూ మంత్రి పువ్వాడ ఆరోపించారు. ఈ సమయంలో కమ్మ కులం వాళ్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు.