10,008 అడుగుల ఎత్తు.. అయోధ్య రామమందిరం మోడల్ రెడీ.. - MicTv.in - Telugu News
mictv telugu

10,008 అడుగుల ఎత్తు.. అయోధ్య రామమందిరం మోడల్ రెడీ..

January 22, 2020

Highest temple in ayodhya 

సుప్రీం కోర్టు తీర్పుతో అయోధ్య వివాదానికి తెరపడిన సంగతి తెలిసిందే. నాలుగైదు నెలల్లో అక్కడ ఆకాశాన్ని తాకే రామమందిరం నిర్మిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. ఆయన నమూనాకు సాధుసంతులు ఆమోదం తెలిపిన నేపథ్యంలో దాని మోడల్‌ను సిద్ధం చేశారు. జ్యోతిపీఠం శంకరాచార్యులు స్వామి స్వరూపానంద సరస్వతి శిష్యుడు, రామాలయ ట్రస్టు కార్యదర్వి స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి దీన్ని మీడియాకు పరిచయం చేశారు. 

వాస్తుశాస్త్రం ప్రకారమే కాకుండా, 21వ శతాబ్ది ప్రమాణాలకు తగ్గట్లు ఆలయాన్ని నిర్మిస్తామని ఆయన తెలిపారు. అయోధ్యకు వచ్చే లక్షలాది భక్తులను దృష్టిలో ఉంచుకుని దీన్ని డిజైన్ చేయించామని వెల్లడించారు. ప్రముఖ స్థపతి అదిత్య గుప్తా దీన్ని రూపొందించారని, దీంతోపాటు మరికొన్ని మోడల్స్ కూడా తయారు చేయించి ఉత్తమమైన దాన్ని ఎంచుకుంటామని చెప్పారు. ‘ఆలయం ఎత్తు 10008 అడుగులు(3 కి.మీ). ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఈ ఆలయోం గర్భగుడి విస్తీర్ణం 216 చదరపు అడుగులు. ఆలయంలో రోజూ 1,08,000 మందికి అన్నదానం ఉంటుంది..’ అని చెప్పారు.