హిజాబ్‌ వివాదం; పిటిషనర్లకు మరో ఎదురుదెబ్బ - MicTv.in - Telugu News
mictv telugu

హిజాబ్‌ వివాదం; పిటిషనర్లకు మరో ఎదురుదెబ్బ

March 24, 2022

11

కర్ణాటకలో సంచలనం సృష్టించిన హిజాబ్ వివాదంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మరోసారి కొట్టివేసింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ముస్లిం విద్యార్థినులు మొదట సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, కోర్టు తిరస్కరించడం తెలిసిందే. హోళీ పండుగ తర్వాత విచారిస్తామని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఇప్పుడు మళ్లీ విచారించాలని, పరీక్షలు దగ్గర పడుతుండడంతో హిజాబ్ ఉంటే పరీక్ష హాలులోకి రానివ్వటం లేదని యువతుల తరపు న్యాయవాది కోరారు. పరీక్షలు రాయకుంటే విద్యార్థినులు ఒక సంవత్సరాన్ని కోల్పోతారని విన్నవించారు. దీనికి స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ.. హిజాబ్ అంశానికి, పరీక్షలకు ఏంటి సంబంధమని ప్రశ్నించారు. రెండింటినీ ముడిపెట్టి సంచలనం చేయొద్దని సూచించారు. ఈ అంశంపై కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది జోక్యం చేసుకోబోతుండగా, జస్టిస్ రమణ వారించారు. ఇక ఈ వ్యాజ్యాన్ని ఎప్పుడు విచారించేదీ అని ఆయన ఏమీ చెప్పలేదు. దాంతో విచారణకు మరి కొంతకాలం పడుతుందని న్యాయ పండితులు అభిప్రాయపడుతున్నారు.