హైద్రాబాదుకు పాకిన హిజాబ్ వివాదం.. స్కూల్లో లాఠీచార్జ్ - MicTv.in - Telugu News
mictv telugu

హైద్రాబాదుకు పాకిన హిజాబ్ వివాదం.. స్కూల్లో లాఠీచార్జ్

April 13, 2022

hijab

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక హిజాబ్ వివాదం ఇప్పుడు తెలంగాణకు పాకింది. వివరాలు.. పాతబస్తీ కిషన్‌ బాగ్‌లో ఉన్న గౌతమ్ స్కూలుకు కొందరు ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి వచ్చారు. దీంతో స్కూలు యాజమాన్యం ఆక్షేపించింది. హిజాబ్ ధరించి స్కూలుకు రావొద్దంటూ విద్యార్ధినులకు సూచించింది. దీంతో విషయాన్ని విద్యార్ధినులు తమ పేరెంట్స్‌కు సమాచారమందించగా, వారు వచ్చి స్కూలు ఎదుట ఆందోళనకు దిగారు. స్పందించిన స్కూలు యాజమాన్యం బహదూర్ పురా పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్కూలు వద్దకు చేరుకున్న పోలీసులు తల్లిదండ్రలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆందోళనను నియంత్రించడానికి ప్రయత్నించారు. అయినా కంట్రోల్ కాకపోవడంతో లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థినులు, వారి తల్లిదండ్రులకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా, విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించి రావడంపై కర్ణాటక హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. విద్యాసంస్థల నిబంధనలకనుగుణంగా ప్రతీ విద్యార్ధి నడుచుకోవాలని ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పుపై పిటిషనర్లు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగులో ఉంది.